- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదృశ్యమైన ఇంటర్ విద్యార్థి.. నీటి కుంటలో శవమై లభ్యం..
దిశ, శంషాబాద్ : నెలరోజుల క్రితం అదృశ్యమైన ఇంటర్ విద్యార్థి నీటికుంటలో శవమై లభించిన ఘటన ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చారినగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏకే టౌన్షిప్ లో ఉండే పెద్దతుప్పర గ్రామానికి చెందిన నిఖిల్ (16) చైతన్య జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. జనవరి 19వ తేదీన కళాశాలకు వెళుతున్నానని చెప్పిన నిఖిల్ ఇంటికి తిరిగి రాలేదు. బంధువుల వద్ద తెలిసిన వారి వద్ద ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో జనవరి 19వ తేదీ రాత్రిఫిర్యాదు చేయడంతో అప్పుడే మిస్సింగ్ కేసుగా నమోదు చేశామన్నారు.
అప్పటి నుండి వెతికిన ఎక్కడా కనిపించకపోవడంతో ఆదివారం చారినగర్ ప్రాంతంలోని కుంటలో మృతదేహం ఉందని సమాచారం రావడంతో ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా మిస్సింగ్ కేసుగా నమోదైన నిఖిల్ మృతదేహం గుర్తించారు. నీటిలో పడి చాలారోజులు కావడంతో మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉందని మృతదేహాన్ని వెలికితీస్తుండగా తల, మొండెం విడిపోయాయని మొండాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి తరలించామని తెలిపారు. తల కొరకు నీటి గుంటలో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అనుమానాస్పదస్తుడిగా కేసునమోదు చేసి విచారిస్తున్నామన్నారు.