- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిన్నారులపై వరుస అత్యాచారాలు.. సరైన శిక్ష విధించిన కోర్టు!
దిశ, వెబ్‌డెస్క్: చిన్నారులు, మహిళలపై ఆత్యాచార ఘటనలు, వేధింపులు రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. ఉత్తర ప్రదేశ్ కస్‌గంజ్‌కు చెందిన రవీందర్ కుమార్ అనే వ్యక్తి 2008 నుంచి 2018వరకు 30 మంది పిల్లలను లైంగికంగా వేధించి, హత్యచేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది మే 6వ తేదీన ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగికంగా హింసించి అనంతరం హత్య చేసిన కేసులో ఢిల్లీ కోర్టు అతడిని దోషిగా నిర్దారించింది. కాగా ఈరోజు( మే25)న జీవిత ఖైదు విధించింది. రవీందర్ 18 ఏళ్ల వయస్సులోనే ఢిల్లీకి వచ్చాడు. పోర్న్, డ్రగ్స్‌కు బానిసయ్యాడు.
రోజంతా కూలి పని చేస్తూ ఒక పూరిగుడిసెలో ఉండేవాడు. డ్రగ్స్ తీసుకున్న అనంతరం అతడు యువతుల కోసం వెతికేవాడట. బాలికలను వెతకడం కోసం కొన్నిసార్లు 40 కిలోమీటర్లు నడిచేవాడట. ఎక్కువగా నిర్మాణ స్థలాలు, మురికి వాడల్లో తిరిగేవాడట. ఎందుకంటే అక్కడ నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలను ఎవ్వరికి డౌట్ రాకుండా.. ఆ పిల్లలకు చాక్లెట్స్, 10 రూపాయల నోట్లు చూపించి ఎత్తుకెళ్లేవాడట. తర్వాత వారిని నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించి, హత్య చేసేవాడని పోలీసులు కోర్టుకు తెలిపారు.
అలాగే, ఓ బాలికను సెప్టిక్ ట్యాంకులో పడేశాడు. ఈ కేసులన్నీ బయటపడడంతో నిందితుడిని అరెస్టు చేయడానికి పోలీసులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. చాలా రోజుల పాటు సీసీ ఫుటేజీ స్కాన్ చేసిన అనంతరం చివరకు 1015లో రోహిణిలోని బస్టాండ్‌లో దొరికాడు. 2015లో రవీందర్ ఔటర్ ఢిల్లీ ప్రాంతంలో అరెస్టు అయ్యాడు. అలాగే బేగంపూర్ పోలీసు స్టేషన్‌లో అతడిపై కేసు నమోదైంది. ఇలా ముప్ఫై మంది ఏ పాపం ఏరుగని చిన్నారులపై ఆత్యాచారాని పాల్పడి, వారిని చంపిన రవీందర్‌ను గత వారమే శిక్ష ఖరారు చేయాల్సి ఉండగా, అతడి ఆదాయం, ఆస్తులపై కోర్టుకు నివేదిక అందకపోవడంతో శిక్ష వాయిదా పడింది.