కిడ్నాప్‌పై సంచలన విషయాలు వెల్లడించిన వైశాలి

by samatah |   ( Updated:2022-12-10 13:50:23.0  )
కిడ్నాప్‌పై సంచలన విషయాలు వెల్లడించిన వైశాలి
X

దిశ, వెబ్‌డెస్క్ : కిడ్నాప్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆదిభట్ల వైశాలి సంచలన వ్యాఖ్యలు చేసింది. నన్ను చాలా ఘోరంగా ట్రీ ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నవీన్ నాకెరీర్‌ను నాశనం చేశారు. కిడ్నాప్ తర్వాత నాపై దాడి చేశారు. పది మంది నన్ను పట్టుకొని తీసుకెళ్లారు. హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంటే గోర్లతో గిచ్చారు, కొరికారు, ఘోరంగా కొట్టారు అని చెప్పుకొచ్చింది. కారులో నవీన్‌తో పాటు ఆరుగురు ఉన్నారు. నవీన్ నా పట్ల దారుణంగా ప్రవర్తించారని వైశాలి పేర్కొంది. నవీన్ రెడ్డితో నాకున్నది ఫ్రెడ్షిప్ మాత్రమే, మా ఇద్దరికి పెళ్లి కాలేదు, నేను అంటే ఇష్టం అంటే, మా పేరట్స్‌ని అడగమని చెప్పాను అని తెలిపింది. నా ఫొటోలు మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నారు, నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్పినా వినలేదు, నీ ఇష్టంతో నాకు పనిలేదు, నన్ను వదిలేసి ఎలా పెళ్లి చేసుకుంటావని దారుణంగా కొట్టాడు, నా పట్ల నవీన్ ఘోరంగా ప్రవర్తించారంది. అలాగే మా నాన్నను చంపుతామని బెదిరించారంటూ వైశాలి తెలిపింది.

Advertisement

Next Story