- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సికింద్రాబాద్ ఫైర్ యాక్సిడెంట్ : ఒకరి డెడ్ బాడీ గుర్తింపు
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ డెక్కన్ నైట్ వేర్ అగ్ని ప్రమాద ఘటన జరిగిన బిల్డింగ్ ఒక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. భవనం మొదటి అంతస్తులో ఒక అస్థిపంజరాన్ని అగ్ని మాపక సిబ్బంది గుర్తించారు. దుకాణం సిబ్బందిలో ఒకరు సజీవదహనమైనట్లు సమాచారం. అయితే ఫైర్ యాక్సిడెంట్ అయిన రోజు నుంచి ముగ్గురు కనిపించకుండా పోయారు. ఈ ప్రమాద ఘటన తర్వాత బీహార్ కు చెందిన ముగ్గురు కూలీలు జునైద్, వసీం, జహీర్ అచూకీ గల్లంతైన విషయం తెలిసిందే.
నిన్న ఉదయం మంటలు తగ్గిన తర్వాత వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు లోపలికి వెళ్లారని స్థానికులు తెలిపారు. ప్రమాద ఘటనలో ముగ్గురు చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తుండగా ఒక మృత దేహం విషయంలో క్లారిటీ రావడంతో వారి అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వేడి తీవ్రత కారణంగా రెస్క్యూ సిబ్బంది మాల్ లోపలికి వెళ్లలేని పరిస్థితి ఉండటంతో డ్రోన్ సహయంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మృతదేహాలు ఉన్నాయా అని గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి : 'సికింద్రాబాద్ ఘటన ప్రభుత్వానికి హెచ్చరిక'