Robbery: నగరంలో భారీ చోరీ.. 2.5 కిలోల బంగారంతో ఉడాయించిన దొంగలు

by Shiva |   ( Updated:2024-12-13 03:53:22.0  )
Robbery: నగరంలో భారీ చోరీ.. 2.5 కిలోల బంగారంతో ఉడాయించిన దొంగలు
X

దిశ, వెబ్‌డెస్క్/రాంనగర్: దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన హైదరాబాద్ (Hyderabad) పరిధిలో గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దోమలగూడ (Domalguda)లోని అరవింద్ కాలనీ (Aravind Colony)లో నివాసం ఉంటున్న బంగారం వ్యాపారి రంజిత్ (Ranjith) ఇంట్లో భారీ చోరీ జరిగింది. ముందుగా కత్తులు, తుపాకులతో ఇంట్లోకి చొరబడిన పది మంది దొంగలు కుటుంబ సభ్యులను బంధించారు. అనంతరం లాకర్‌ (Locker)లో భద్రపరిచిన 2.5 కిలోల బంగారం, కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా అపహరించుకుపోయారు. అదేవిధంగా చోరీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా సీసీ టీవీ డీవీఆర్‌ (CC TV DVR)ను కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే, దొంగల దాడిలో ఇంటి యజమాని రంజిత్ (Ranjith) తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed