- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బస్సు, ద్విచక్ర వాహనం ఢీ .. ఇద్దరు యువకులకు గాయాలు..
by Sumithra |
X
దిశ, నిజామాబాద్ క్రైం : బోధన్ - నిజామాబాద్ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెలితే షాపింగ్ మాల్ లో పని చేసే ఇద్దరు మిత్రులు నవాజుద్దీన్ (23) , ఇర్ఫాన్ (20 ) ద్విచక్ర వాహనం మీద రెంజల్ మండల్ నీలా గ్రామం నుంచి నిజామాబాద్ కు వస్తున్నారు.
మార్గమధ్యంలో నిజామాబాద్ డైరీ ఫార్మ్ వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో నవాజుద్దీన్ కు కుడికాలు విరిగి పక్కకు పడిపోయింది. ఇర్ఫాన్ కు కాలు పైన తీవ్రగాయాలయ్యాయి. కాగా తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న నవాజుద్దీన్ ను 108లో చికిత్సను అందిస్తూ నిజామాబాద్ జీజీహెచ్ హాస్పిటల్ కు తరలించారు. ఆరవ టౌన్ పోలిస్ లు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story