- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నకిలీ బంగారం అమ్మినారనే కారణంతో మహిళలపై అత్యాచారం.. నిందితుల అరెస్ట్..
దిశ, జడ్చర్ల: నకిలీ బంగారం తమకు అమ్మి మోసం చేశారనే కారణంతో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఇద్దరి మహిళలపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన నిందితులను గురువారం జడ్చర్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. స్థానిక సీఐ రమేష్ బాబు కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన లక్ష్మీ జడ్చర్ల మండలంలోని కోడుగల్ సమీపంలో ఒక మామిడి తోటలో నాలుగేళ్ల క్రితం పని చేసింది. అక్కడి నుంచి బాలనగర్ మండలం నేరలపల్లి గ్రామ సమీపంలో మరో మామిడి తోటలో పనికి కుదిరింది. అయితే కోడుగల్ తోట వద్ద పనిచేస్తున్న సమయంలో నెక్కొండ గ్రామానికి చెందిన బాలస్వామి అనే వ్యక్తితో లక్ష్మికి పరిచయం ఉంది.
కాగా లక్ష్మికి అచ్చంపేటలో నకిలీ బంగారం అమ్మే ముఠాతో పరిచయం ఉండడంతో తక్కువ ధరకే బంగారం అమ్మేవాళ్లు తెలుసు అని డబ్బులు ఉంటే కొనుక్కోండని బాలస్వామితో చెప్పింది. దీంతో రెండు నెలల క్రితం బాలస్వామి రెండు లక్షల రూపాయలు ఇవ్వగా కొంత బంగారాన్ని ఆయనకు ఇచ్చారు. అది కాస్త నకిలీ బంగారం అని తెలియడంతో మోసపోయానని తెలుసుకున్న బాలస్వామి వారిపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే పథకం ప్రకారం లక్ష్మితో మరింత బంగారం కావాలని నమ్మబలికించి ఇదివరకు నకిలీ బంగారం అంటగట్టిన ముఠాను రప్పించేందుకు నిర్ణయించుకున్నాడు.
కాగా ఈ నెల 8 వ తేదీ సదర్ గ్యాంగ్ కల్వకుర్తి రావడంతో నెక్కొండ గ్రామానికి చెందిన నకిలీ బంగారం బాధితుడు బాలస్వామితో పాటు కురువ నరేష్, శ్రీశైలం, ప్రవీణ్, శేఖర్, గణేష్, వంశీ, అలాగే జడ్చర్లకు చెందిన చాకలి వంశీలు స్కార్పియో వాహనం తీసుకుని కల్వకుర్తికి చేరుకున్నారు. నకిలీ బంగారం తీసుకొచ్చిన రమేష్, మరో ఇద్దరి మహిళలను కల్వకుర్తి సమీపంలోని జేపీ నగర్ వద్ద స్కార్పియో వాహనంలో ఎక్కించుకొని కోడుగల్ సమీపంలోని తోటకి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి వరకు ఇద్దరు మహిళలతో పాటు మరో వ్యక్తిని చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా సదరు ఇద్దరి మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
9వ తేదీ రాత్రి అక్కడి నుంచి బయటపడ్డ రమేష్, ఓ మహిళ గ్రామస్తుల సహాయంతో జడ్చర్ల పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేయగా గురువారం జడ్చర్ల రైల్వే స్టేషన్ సమీపంలో మూడు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న నిందితులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో లక్ష్మి, స్కార్పియో డ్రైవర్ వంశీలు పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్సై ఖాదర్ ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.