కొడుకు ప్రాణం మీదకు తెచ్చిన తల్లిదండ్రుల గొడవ

by Sridhar Babu |
కొడుకు ప్రాణం మీదకు తెచ్చిన తల్లిదండ్రుల గొడవ
X

దిశ, వీపనగండ్ల : కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం మండల పరిధిలోని గోపాల్ దిన్నె గ్రామానికి చెందిన మిట్టకడుపుల మహేష్ అనే యువకుడు హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

దసరా పండుగ కోసం గ్రామానికి రాగా తల్లిదండ్రులు నరసింహ, నర్సమ్మ కుటుంబ విషయంలో గొడవ పడ్డారు. దాంతో గొడవ పడొద్దని మహేష్ తల్లిదండ్రులకు నచ్చజెప్పాడు. అందుకు తల్లి కోపగించుకుంది. దాంతో అసహనంతో మహేష్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం వీపనగండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్​లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed