- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్ జిల్లాలో పోలీసుల కాల్పులు
రాజస్థాన్ దొంగల ముఠాపై కాల్పులు, బారీకేడ్లను కారుతో గుద్ది దొంగలు పరార్
రెండు రౌండ్ల కాల్పులు జరిపిన పోలీసులు
పారిపోయిన దొంగల కోసం పోలీసుల గాలింపు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్ ఫార్మర లోని రాగి తీగను దొంగలించే ముఠాపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాజస్థాన్ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జాతీయ రహదారిపై ఒక సీఐ, ఐదుగురు ఎస్సైలు రోడ్డుపై బారికేడ్లను పెట్టి కాపుకాశారు. రాజస్థాన్ దొంగల ముఠా కారును ఆపకుండా బారికేడ్లను కారుతో ఢీకొట్టారు.
దీంతో కారును ఆపి ఐదుగురు సభ్యులు గల ముఠా అక్కడి నుంచి పారారయ్యారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. వ్యవసాయ క్షేత్రాల వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్ లోని కాపర్ ను ఈ ముఠా చోరికి పాల్పడుతున్నారు. పారిపోయిన దొంగల కోసం పోలీసులు టీంలుగా ఏర్పడి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రాజస్థాన్ దొంగల ముఠాను పట్టుకునేందుకు ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు.