- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గంజాయి తరలిస్తున్న ఐదుగురు అరెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో : డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో గంజాయి రవాణా చేస్తూ ఐదుగురు పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. సోమవారం రాత్రి ఐదుగురు వ్యక్తులు గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే నిందితులను ఎస్పీ కార్యాలయంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నిందితులు ప్రత్తిపాడుకు చెందిన కించు అప్పారావు, పిఠాపురానికి చెందిన సంఘటాల రాజేష్, రామచంద్రపురం మండలం పెద్ద తాళ్లపాలెం గ్రామానికి చెందిన కొప్పిశెట్టి సత్యనారాయణ, కాకినాడలో ఉంటున్న వెల్ల గ్రామస్తుడు మర్రెడ్డి దినేశ్వరరావు, చింతపల్లి లాకులకు చెందిన వాసంశెట్టి బన్నీలుగా గుర్తించినట్లు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
మెుత్తం ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించబోతున్నట్లు వెల్లడించారు.డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా పై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన, మాదకద్రవ్యాలు సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.