దారుణం.. కన్న కొడుకును తిరిగి తీసుకునేందుకు నిరాకరిస్తున్న తల్లిదండ్రులు

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-02 08:48:12.0  )
దారుణం.. కన్న కొడుకును తిరిగి తీసుకునేందుకు నిరాకరిస్తున్న తల్లిదండ్రులు
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట(Suryapet) జిల్లా రామచంద్రాపురం దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తల్లిదండ్రులు 15 నెలల క్రితం మూడు నెలల వయసున్న మగ శిశువును విక్రయించారు. విషయం తెలుసుకున్న శిశు సంక్షేమ శాఖ(Department of Child Welfare) అధికారులు తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం బాలుడితో పాటు కన్నవారిని, పెంచుతున్న వారిని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం బాబుని కన్నవారికి అప్పగించేందుకు ప్రయత్నించగా.. అనూహ్యంగా వారు తిరిగి తీసుకునేందుకు నిరాకరించారు.

దీంతో చేసేదేం లేక బాలుడ్ని చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసుకు తరలించారు. ప్రస్తుతం అధికారుల సంరక్షణలో ఉన్నారు. మరోవైపు.. పసిపిల్లలను అంగడి వస్తువులుగా మార్చి విక్రయిస్తున్న ఘటనలు దేశ వ్యాప్తంగా రోజుకో చోట వెలుగుచూస్తున్నాయి. సంతానం లేని దంపతులకు చిన్నారులను విక్రయిస్తున్న, కొనుగోలు చేసిన 11 మందిని ఇటీవల రాచకొండ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరొకటి వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. సూర్యాపేట ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed