చెరువులోపడి వృద్ధుడు మృతి

by Sridhar Babu |
చెరువులోపడి వృద్ధుడు మృతి
X

దిశ, అశ్వారావుపేట : చెరువులో పడి వృద్ధుడు మృత్యువాత పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉట్లపల్లిలో చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలకు నల్లబాడు రోడ్డులోని చెరువులో తేలియాడుతున్న మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

మృతుడు రామిశెట్టి నాగేశ్వరరావు (60) గా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్​లో నివాసం ఉండే రామిశెట్టి నాగేశ్వరరావు భార్యతో కలిసి దసరా సెలవులకు అశ్వారావుపేటలోని కూతురి వద్దకు వచ్చాడు. అనంతరం ఉట్లపల్లిలోని తమ్ముడు ఇంటికి వెళ్లాడు. రాత్రి మద్యం మత్తులో చెరువులో పడటంతో మృతి చెంది ఉంటాడని కుటుంబీకులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed