మస్తాన్ సాయి న్యూడ్ వీడియోల కేసులో బిగ్ ట్విస్ట్.. డీఐతో లావణ్య వీడియో కాల్ లీక్

by Bhoopathi Nagaiah |   ( Updated:2025-02-13 11:59:20.0  )
మస్తాన్ సాయి న్యూడ్ వీడియోల కేసులో బిగ్ ట్విస్ట్.. డీఐతో లావణ్య వీడియో కాల్ లీక్
X

దిశ, వెబ్‌డెస్క్: మస్తాన్ సాయి న్యూడ్ వీడియోల కేసు(Mastan Sai Nude Videos Case)లో లావణ్య(Lavanya) ఇష్యూ కీలక మలుపు తిరిగింది. ఆమెతో పరిచయం కారణంగా ఓ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (Detective Inspector) పోలీసు అధికారుల ఆగ్రహానికి గురయ్యారు. కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్‌కు వచ్చిన లావణ్యతో పరిచయం పెంచుకోని ఆమెతో వీడియో కాల్స్ మాట్లాడుతూ, తరచూ చాటింగ్ చేస్తుండటంతో సీపీ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో తాజాగా డీఐ(DI) ఇరుక్కోవడం సంచలనంగా మారింది. ఇంతకూ ఏం జరిగిందంటే..

వీడియో కాల్‌లో ఏం మాట్లాడుకున్నారంటే..

హలో.. కాదు.. అక్కడ ఎక్కడో రోడ్డు బాలేదన్నారు కదా.. నువ్వు వచ్చి నన్ను ఎక్కించుకోవచ్చు కదా... రోడ్డు బాగలేదా లేక మీకు నన్ను కలవడం ఇష్టం లేదా..? చెప్పండి పర్వాలేదు. నాది గుండె కాదు.. రాయి గుండె అని అర్థం చేసుకోండి. డిస్ట్రబ్ చేస్తున్నానా నేను మిమ్ముల్ని.. అని లావణ్య అనగా.. అలా ఏం లేదు కానీ ఆ 11 కిలోమీటర్స్ దాటి రావద్దని అవతలి వ్యక్తి బదులిచ్చాడు. నేను ఆ 11 కి.మీ లిమిట్స్ దాటి వస్తే ఏం చేస్తారు అంటూ లావణ్య ప్రశ్నించడంతోపాటు నేను అక్కడికి రావద్దా అంటూ పదే పదే అడగడం ఆ వీడియో కాల్ లో రికార్డ్ అయింది. నేను ఊరికే ఫోన్ చేస్తున్న కదా.. క్షమించండి.. బై అంటూ లావణ్య మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వారిద్దరి మధ్య 3.31 నిమిషాలు సంభాషణ జరిగింది. ఈ సమయంలో లావణ్య హ్యాపీ మూడ్‌లో ఉన్నట్లు వీడియోలో స్పష్టంగా అర్థం అవుతోంది.

డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌‌పై సీపీ సీరియస్

అయితే మూడు రోజుల క్రితమే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సైబరాబాద్ సీపీ(Cyberabad CP) సీరియస్ అయ్యారు. వెంటనే శాఖపరమైన విచారణకు ఆదేశించారు. నార్సింగ్ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ (Nursing Detective Inspector Srinivas)శ్రీనివాస్‌.. లావణ్యతో క్లోజ్‌గా మూవ్ అయినట్లు నిర్ధారణ కావడంతో ఆయన్ని ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రాజ్ తరుణ్ పై ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన సమయంలో లావణ్యకు డీఐ శ్రీనివాస్‌కు పరిచయం ఏర్పడింది. ఆ కేసు విచారణలో భాగంగా శ్రీనివాస్ తరచూ లావణ్యను కలవడంతో ఇద్దరి మధ్య క్లోజ్‌నెస్ పెరిగింది. దీంతో ఇద్దరు వాట్సాప్ వీడియో, ఆడియో కాల్స్ మాట్లాడుకుంటున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ సాన్నిహిత్యంతో మస్తాన్ సాయి కేసులో లావణ్యకు డీఐ శ్రీనివాస్ ఫేవర్ చేసినట్లు విమర్శలు ఉన్నాయి. ఇదే కాకుండా డీఐపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మస్తాన్ సాయి నుంచి స్వాధీనం చేసుకున్న న్యూడ్ వీడియోల హార్డ్ డిస్క్ నుంచి కొన్ని నగ్న వీడియోలు, ఫొటోలు, ఆడియోల క్లిప్స్ బయటకు లీక్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి https://x.com/TeluguScribe/status/1889902258789154965

Advertisement
Next Story

Most Viewed