Crime News : 10 నెలల్లో 3000 కిలోల డ్రగ్స్ పట్టుకున్న ముంబయి పోలీసులు

by M.Rajitha |   ( Updated:2024-11-09 13:09:18.0  )
Crime News : 10 నెలల్లో 3000 కిలోల డ్రగ్స్ పట్టుకున్న ముంబయి పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: గత 10 నెలల్లో ముంబై(Mumbai) నార్కోటిక్‌ విభాగం పోలీసులు 3000 కిలోల డ్రగ్స్(Drugs) ను పట్టుకున్నారు. డ్రగ్స్ సప్లయ్‌ చేస్తున్న 146 మందిని అరెస్ట్ చేయగా.. మొత్తం 68 కేసులు నమోదు చేశారు. కేవలం పదినెలల్లో మొత్తం రూ.55 కోట్ల విలువ చేసే 3,010 కిలోల డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు. ఈ విషయాన్ని ముంబై క్రైమ్‌ బ్రాంచ్ పోలీసులు శనివారం సాయంత్రం వెల్లడించారు. తాజాగా నిషేధిత డ్రగ్స్‌ను సప్లయ్‌ చేస్తున్న నలుగురు వ్యక్తులను ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. వారి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.2.36 కోట్ల విలువ చేసే 594 గ్రాముల హెరాయిన్‌ డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు. ఎవరికి ఆ డ్రగ్స్‌ను సప్లయ్‌ చేస్తున్నారనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. ఆ మేరకు పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed