Monkeys Attack: నిర్మల్ జిల్లాలో ఘోరం.. కోతుల దాడిలో మహిళ మృతి

by Shiva |   ( Updated:2024-10-21 11:32:23.0  )
Monkeys Attack: నిర్మల్ జిల్లాలో ఘోరం.. కోతుల దాడిలో మహిళ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా అడవులు క్రమంగా అంతరించిపోతున్న తరుణంలో అక్కడ ఉండే వన్య మృగాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా వానరాలు ప్రతి పల్లెను వణికిస్తూనే ఉన్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా విచక్షణారహితంగా దాడి చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం నిర్మల్ జిల్లా పరిధిలో ఘోరం చోటుచేసుకుంది. ఖానాపూర్ పట్టణానికి చెందిన ఓ మహిళపై ఓ కోతుల గుంపు ఒక్కసారిగా దాడి పాల్పడింది. ఈ దాడిలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed