- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు నెలలుగా మిస్సింగ్.. విద్యార్థి అనుమానాస్పద మృతి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మూడు నెలలుగా కనిపించకుండా పోయిన కొడుకు తిరిగి వస్తాడని ఆశపడ్డ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. ఉన్నత చదువులు చదివి తమకు బాసటగా నిలుస్తాడనుకున్న కొడుకు అనుమానాస్పద మృతి వారి కుటుంబంలో విషాదం నింపింది. మూడు నెలల క్రితం డిగ్రీ కాలేజ్‌కి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన విద్యార్థి సోమవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన బోధన్ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్ గామ్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ (19) డిగ్రీ చదువుతున్నాడు.
మూడు నెలల క్రితం కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వెతికినా విద్యార్థి ఆచూకీ తెలియలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. డిగ్రీ విద్యార్థి అదృశ్యం వెనుక ప్రేమ వ్యవహారం కారణమని అనుమానాలున్నాయి. దీనిపై విపక్ష పార్టీలు ప్రభుత్వంపై అలాగే పోలీసులపై ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సదరు డిగ్రీ విద్యార్థి బోధన్ పట్టణ శివారులో శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More...