మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో భారీ చోరీ.. నగదు, నగలతో ఉడాయింపు

by Shiva |   ( Updated:2025-01-17 04:01:47.0  )
మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో భారీ చోరీ.. నగదు, నగలతో ఉడాయింపు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ (Hyderabad)లోని జూబ్లీహిల్స్‌ (Jubilee Hills)లో నివాసం ఉంటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) ఇంట్లో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించి రూ.లక్షన్నర నగదుతో పాటు బంగారు అభరణాలను కూడా ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలోనే పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణా దేవి జరిగిన దోపిడీపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Next Story

Most Viewed