సంవత్సరం క్రితమే వివాహం.. అంతలోనే విషాదం

by Kalyani |
సంవత్సరం క్రితమే వివాహం.. అంతలోనే విషాదం
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన రుద్రారం గ్రామ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామానికి చెందిన బైండ్ల ప్రవీణ్ (21) పటాన్చెరు మండలం రుద్రారం పరిధిలోని తోషిబా కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే శుక్రవారం ఉదయం తన స్నేహితుడైన ఇమ్రాన్ తో కలిసి కంపెనీలో తనకు వచ్చే డబ్బులు తీసుకోవడానికి వెళ్ళాడు. అక్కడి నుంచి పాశమైలారం కు ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో ఓ గుర్తు తెలియని వాహనం వీరిని ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందగా బైక్ పై ఉన్న మరో యువకుడు ఇమ్రాన్ కి గాయాలు అయ్యాయి. ప్రవీణ్ కు సంవత్సరం క్రితమే పెళ్లి గాక ప్రస్తుతం అతడి భార్య నిండు గర్భవతి గా ఉన్నది. అతడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దుర్ఘటనకు కారకులైన వారిని పోలీసులు గుర్తించి కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed