- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్వారీ గుంతలో పడి వ్యక్తి మృతి..
దిశ, జిన్నారం: జిన్నారం మండలంలోని కాజిపల్లి లో గల జీఎంఆర్ కాలనీ శివారులో గల క్వారీ గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మంగల్ పర్తి గ్రామానికి చెందిన చిట్యాల రవి తో పాటు అతని అన్నయ్య అయిన చిట్యాల రఘు ఇద్దరు కాజిపల్లి గ్రామంలోని జీఎంఆర్ కాలనీలో నివాసం ఉంటూ, కూలి పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో అన్నదమ్ములు కలిసి కాలనీ శివారులో గల ఓ కంకర క్రషర్ క్వారీలో స్నానానికి వెళ్లారు. చిట్యాల రవి ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో గల నీళ్లలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని తమ్ముడు రఘు పోలీసులకు సమాచారాన్ని అందజేశాడు. గజ ఈత గాళ్ళతో రవి మృతదేహం కోసం గాలించారు. రవి ఆచూకీ లభించలేదు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.