- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఛీ.. ఛీ.. స్మగ్లింగ్ కోసం చివరకు ఆ అవయవాన్ని కూడా వదల్లే!
by Satheesh |
X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం భారీగా బంగారం పట్టుబడింది. నిర్ధిష్ట సమాచారంతో కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు మస్కట్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో వింతేముంది అనుకోకండి.
అతగాడు చేసిన బంగారు స్మగ్లింగ్ తీరును చూసి ఎయిర్‌పోర్టు అధికారులు కూడా నివ్వెరపోయారు. పేస్ట్ రూపంలో బంగారాన్ని అతడు దాచిన ప్లేస్‌ను చూసి అధికారులు అవాక్కయ్యారు. అయితే ఆ ప్రయాణికుడు రూ. 42,78,768 విలువ గల, 685.7 గ్రాముల బంగారాన్ని పేస్ట్ రూపంలో పురీషనాళంలో దాచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
Advertisement
Next Story