భార్య హత్య కేసులో భర్తకు జైలు శిక్ష.. చివరకు ఆమె బతికే ఉన్నదని తెలియడంతో

by sudharani |   ( Updated:2022-09-09 09:53:53.0  )
భార్య హత్య కేసులో భర్తకు జైలు శిక్ష.. చివరకు ఆమె బతికే ఉన్నదని తెలియడంతో
X

దిశ, వెబ్‌డెస్క్: వరకట్న వేధింపులతో భార్యను హతమార్చిన కేసులో ఓ భర్త ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాడు. తీరా దర్యాప్తులో ఆమె బతికే ఉందని తేలడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన బిహార్‌లోని సీతామఢీ జిల్లా చోరౌత్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

పరిగావన్ గ్రామానికి చెందిన శశికుమార్‌కు, నేపాల్ యువతి హీరాదేవితో పెళ్లైంది. వారికి ఏడాది కొడుకు ఉన్నాడు. అయితే హీరాదేవి 7 నెలల క్రితం అదృష్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు అల్లుడే తన కూతురుని వరకట్నం కోసం వేధించి హతమార్చాడని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శశికుమార్‌ను జైల్‌లో పెట్టారు. ఆరున్నరేళ్ల తర్వాత ఆమె పుట్టింట్లో క్షేమంగా ఉందని తెలుసుకున్న పోలీసులు ఖంగుతిన్నారు. హీరాదేవికి మతిస్థిమితం లేకపోవడంతో తప్పిపోయిందని నిర్థారణకు వచ్చారు. అనంతరం శశికుమార్ తాజాగా విడుదల చేశారు.

Also Read : Kidnap: మైనర్‌ను కిడ్నాప్ చేసిన గ్యాంగ్.. రాత్రంతా గదిలో

Advertisement

Next Story

Most Viewed