- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరకట్న వేధింపులతో మహిళ మృతికి కారణమైన వ్యక్తికి జైలు, జరిమానా
దిశ, నారాయణపేట ప్రతినిధి: వరకట్న వేధింపులతో మహిళ మృతికి కారణమైన వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ బుధవారం తీర్పునిచ్చారు. కేసు వివరాల్లోకి వెళితే.. మక్తల్ కు చెందిన రాజేశ్వరి (24) కు 2003లో చంద్రశేఖర్ గౌడ్ తో వివాహం జరిగింది. కొద్ది రోజుల తర్వాత భర్త చంద్రశేఖర్ అదనపు కట్నం కోసం వేధించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొంత నగదును ఇచ్చారు. తిరిగి మళ్లీ అదనపు కట్నం ఇవ్వాలని వేధించడంతో 16 ఫిబ్రవరి 2005 సంవత్సరంలో రాజేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది.
దీంతో మృతురాలి తండ్రి పండిత్ రాజ్ తన కూతురి చావుకు చంద్రశేఖర్ కారణమంటూ మక్తల్ పోలీస్ స్టేషన్ లో అప్పట్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా 12 మంది సాక్షులను జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 15 వేల జరిమానా విధించారు. కేసు దర్యాప్తులో కీలకపాత్ర వహించిన పీపీ మురళి, ఆఫీసర్ బాలకృష్ణ ఇతర పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఇదిలా ఉండగా చంద్రశేఖర్ గౌడ్ పై కోర్టులో కేసు కొనసాగుతుండగానే మరొక మహిళతో వివాహం చేసుకొని ఇద్దరికీ సంతానంగా ఉంటూ కర్ణాటకలో వ్యాపారం చేస్తూండేవాడని సమాచారం.