- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూల్ బస్సులో మంటలు.. ప్రమాదమా..? కుట్రతో చేసిందా ..?
దిశ, జడ్చర్ల: ప్రైవేట్ పాఠశాల ప్రాంగణంలో నిలిపి ఉన్న స్కూల్ బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్దమైన ఘటన సోమవారం జడ్చర్ల పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల పట్టణంలోని అక్షర ప్రైవేట్ పాఠశాల ప్రాంగణంలో పాఠశాలకు చెందిన ఓ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు చెలరేగిన బస్సు పక్కన మరో రెండు బస్సులు ఉండడంతో బస్సు డ్రైవర్ అప్రమత్తతో బస్సులను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఫైర్ సిబ్బంది బస్సులో చెలరేగిన మంటలను ఆర్పేశారు. కాగా అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ బస్సులో మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూటే కారణమా..? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారా..? అని కాలనీ ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో అక్షర పాఠశాలకు చెందిన బస్సుల అద్దాలను కొందరు దుండగులు పగలగొట్టిన ఘటనలు ఉండడంతో ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.