ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టు రట్టు.. 12 మంది అరెస్ట్.. పరారీలో మరో ఐదుగురు

by Kalyani |
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టు రట్టు.. 12 మంది అరెస్ట్.. పరారీలో మరో ఐదుగురు
X

దిశ, దుండిగల్/పేట్ బషీరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నగర శివారు ప్రాంతమైన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు అడ్డాగా మారింది. బెట్టింగ్ రాకెట్ అక్రమాలను స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. నగర శివారు ప్రాంతమైన పేట్ బషీరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నా విశ్వసనీయ సమాచారంతో ఈ నెల 19వ తేదీన సాయంత్రం ఎస్ఓటీ, మేడ్చల్ జోన్ పోలీసులు 2 చోట్ల దాడులు నిర్వహించి 12 మంది నిందితుల నుంచి రూ. కోటి 41 లక్షల 52 వేలు విలువ చేసే నగదును, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గురువారం పేట్ బషీరాబాద్ లో డీసీపీ సందీప్ గొనె డీసీపీ ఆఫీస్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ల దృష్ట్యా నగర శివారు ప్రాంతాల్లో బెట్టింగ్ లు జరిగే అవకాశం ఉందన్నా అనుమానంతో గట్టి నిఘా పెంచామన్నారు. నగర శివారు ప్రాంతమైన పేట్ బషీరాబాద్ ప్రాంతంలో 2 చోట్ల బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నా విశ్వసనీయ సమాచారంతో స్థానిక పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేశామన్నారు. వీరంతా నగరంలో స్థిరపడ్డ ఆంధ్రా, ఇతర రాష్ట్రాలకు చెందినవారని చెప్పారు. 12 మందిని అరెస్ట్ చేశామని ప్రధాన నిందితులు ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

వీరిని పట్టుకుంటే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందన్నారు. వీరివద్ద నుంచి సుమారు కోటి 41 లక్షల 52 వేలు విలువగల 50 లక్షల నగదు, 5 బెట్టింగ్ బోర్డులు, 8 ల్యాప్ ట్యాబ్ లు, 62 మొబైల్ ఫోన్ లు, 20 స్మార్ట్ ఫోన్ లు, ఒక ట్యాబ్, 4 టీవీలు, ఒక రూటర్, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని నిందితులపై క్రైమ్ నెంబర్ 364/2023, అండర్ సెక్షన్ 3 అండ్ 4 టీఎస్ గేమింగ్ యాక్ట్ ఆఫ్ పేట్ బషీరాబాద్ పీఎస్ 2, క్రైమ్ నెంబర్ 365/2023 అండర్ సెక్షన్ 3 అండ్ 4, టీఎస్ గేమింగ్ యాక్ట్ ఆఫ్ పేట్ బషీరాబాద్ పీఎస్ ప్రకారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపామన్నారు.

నిందితుల వివరాలు..

ఈస్ట్ గోదావరి జిల్లా పరకొండ మండలం బారగపూడి గ్రామానికి చెందిన ముత్తిని వసంత కుమార్(42), నిజామాబాద్ జిల్లా దంగార మండలం మాధవ్ నగర్ కు చెందిన పండూరి వెంకట సాయి(28), కేపీహెచ్ బీ కాలనీలో నివాసం ఉంటున్న ఈస్ట్ గోదావరి జిల్లా భీమవరం మండలం ఏఎస్ రాజునగర్ కు చెందిన కలిడింది వెంకట రమణ(41), కేపీహెచ్ బీ 6 వ ఫేస్ లో నివాసం ఉంటున్న విజయవాడ గొల్లపల్లి మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన కృతివెంటి రమేష్ (34), నిజాంపేట్ ప్రగతి నగర్ కు చెందిన చిట్టిబొమ్మ కార్తీక్(32), అమీర్ పేట్ లో నివాసం ఉంటున్న కాకినాడ లక్ష్మీ టవర్స్ కు చెందిన బండారి శివకుమార్ (37), టెంపుల్ అల్వాల్ కు చెందిన మిద్దెల మనోజ్ కుమార్(40), అమీర్ పేట్ లో నివాసం ఉంటున్న ఈస్ట్ గోదావరి జిల్లా పారకొండ మండలం బురగపూడి గ్రామానికి చెందిన చింతల వెంకట పద్మా చంద్రమోహన్ రావు(43), అమీర్ పేట్ లో నివాసం ఉంటున్న రాజమండ్రి మరపుడికి చెందిన చక్రపాటి సతీష్ కుమార్(30),

అమీర్ పేట్ లో నివాసం ఉంటున్న భీమవరం శివంపేట్ గ్రామానికి చెందిన మన్నే సత్యనారాయణ(31), అమీర్ పేట్ లో నివాసం ఉంటున్న ఈస్ట్ గోదావరి జిల్లా రాజనాగారం మామవరం కు చెందిన పాతపాటి రవి వర్మ(30) లను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులైన రాజమండ్రికి చెందిన అయ్యప్ప, ఈస్ట్ గోదావరి ఏలూరు టౌన్ కు చెందిన కుమార్, కాకినాడకు చెందిన పండు, ప్రధాన నిందితులైన విశాఖపట్నంకు చెందిన ఎస్ కె జాలాని, భీమవరంకు చెందిన ప్రభాకర్ పరారీలో ఉన్నారన్నారు. వీరు దొరికితే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందన్నారు. వీరంతా విశాఖపట్నం కేంద్రం ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిజిటలైజేషన్ త్వరగా డబ్బు సంపాదించాలన్నా దూరాశతో కొంత మంది క్రికెట్ బెట్టింగ్ కు ఎగబడ్డారన్నారు. అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story