ఆర్మూర్ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

by Shiva |
ఆర్మూర్ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
X

దిశ ఆర్మూర్ : ఇంటర్ ఫెయిలైన కారణంగా ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆర్మూర్ మునిసిపాలిటీ పరిధిలోని శాస్త్రి నగర్ లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు లక్ష్మణ్ కుమారుడు ప్రజ్వల్ (17) ఇంటర్ ఫస్టియర్ హైదరాబాద్ లోని నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ప్రజ్వల్ ఫెయిల్ అయిన కారణంగా మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్ఎంపీ వైద్యుడు లక్ష్మణ్ కు ఒక కుమార్తె, ఓ కుమారుడు సంతానం. ఎదిగిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడడంతో బాధిత కుటంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రజ్వల్ మృతి చెందడంతో ఆర్మూర్ లోని శాస్త్రి నగర్ ఏరియాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story