- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిన భర్త... ఐదు రోజులైనా లభ్యం కాని ఆచూకీ
by Sridhar Babu |

X
దిశ, తిరుమలగిరి : బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంసారీ బజారుకు చెందిన కోరం రాజు అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై శివశంకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం రాజు, అతని భార్యకు గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 9న రాత్రి రాజు తన భార్యతో గొడవపడి ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. కాగా రాజు తిరిగి వస్తాడని కుటుంబ సభ్యులు 5 రోజులుగా ఎదురు చూసినా తిరిగి రాలేదు. దాంతో బంధువుల ఇండ్లలో, సమీపంలోని అన్ని ప్రదేశాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో రాజు సోదరుడు కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Next Story