- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Prayagraj: కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం
![Prayagraj: కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం Prayagraj: కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం](https://www.dishadaily.com/h-upload/2025/01/30/416398-kumbh-mela.webp)
దిశ, వెబ్‌డెస్క్: కుంభమేళా(Kumbh Mela)లో మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ 22(Sector 22nd)లో గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు, పోలీసులు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరుగడంతో స్థానికులు, భక్తులంతా అక్కడినుంచి భయంతో పరుగులు తీశారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి సంబంధించిన అంశాలపై ఆరా తీస్తున్నారు. కాగా, ఇటీవలే ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన తొక్కిసలాలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి 1-2 గంటల మధ్య ఒకటిరెండు చోట్ల తొక్కిసలాట జరగ్గా.. 20 మందికిపై అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఈ ఘటనలపై ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) భావోద్వేగానికి గురయ్యారు. వరుస ఘటనలు హృదయ విదారకంగా ఉన్నాయని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతేకాదు.. ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ఏర్పాటు చేశారు. అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు.. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు తెలిపారు. కుంభమేళా అథారిటీ, పోలీస్, పరిపాలనా యంత్రాంగం, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ దళాలు.. తాము చేయగలిగేవన్నీ చేస్తున్నామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
ఇదిలా ఉండగా.. కుంభమేళాకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. హర హర మహాదేవ్ అనే నినాదంతో ప్రయాగ్రాజ్(Prayagraj) మారుమోగుతున్నది. రోజూ లక్షల్లో భక్తులు అక్కడకు చేరుకొని పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. భారత్‌లోని నటుమూలల నుంచే కాకుండా బ్రెజిల్, స్పెయిన్, రష్యా, అమెరికాతో పాటు పలు దేశాల నుంచి భక్తులు భారీ ఎత్తున వస్తున్నారు. త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. కాగా, 45 రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక పండుగ కొనసాగనుంది.