- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టివేత..
దిశ, శంషాబాద్: గుట్టు చప్పుడు కాకుండా యదేచ్చగా డ్రగ్స్ ను అక్రమ రవాణా చేస్తూ డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. డీఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విదేశాల నుంచి అక్రమ రవాణా చేస్తున్నారని పక్క సమాచారం రావడంతో సోమవారం తెల్లవారుజామున మలావి నుంచి దోహా మీదుగా హైదరాబాద్ రావడానికి శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన మహిళ ప్రయాణికురాలిని అడ్డుకొని తనిఖీలు నిర్వహించారు.
ఆ మహిళ సూట్ కేసును స్కానింగ్ చేసి పరిశీలించగా అందులో హెరాయిన్ ఉన్నట్లు గుర్తించారు. సూట్ కేసులో తెల్లని పౌడర్ రూపంలో ప్యాకెట్లు తయారు చేసి కింది భాగంలో పెట్టి తరలిస్తున్నట్లు గుర్తించి ఆ సూట్ కేసు నుంచి 41.3 కోట్ల విలువ చేసే 5.90 కిలోల స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మహిళను అదుపులోకి తీసుకొని ఎన్డిపిఎస్ చట్టం 1985 ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.