- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తాగి ఇబ్బంది పెడుతున్నాడని హతమార్చారు

దిశ, జగిత్యాల రూరల్ : గతేడాది జూన్ లో బీర్పూర్ శివారు రోళ్ల వాగు సమీపంలో జరిగిన అంకం లక్ష్మీనారాయణ హత్య కేసులో నిందితులను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 14-06-2024 రోజున రోళ్ల వాగు దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తిని పెట్రోల్ పోసి నిప్పు అంటించి హతమార్చారని అప్పటి కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే కుటుంబ సభ్యులు అంకం సాయి కుమార్ అతడి భార్య అంకం అరుణకు మృతదేహాన్ని చూపించగా వారు ఆ శవం తమకు చెందినది కాదని తేల్చి చెప్పి వెళ్లిపోయారు.
అయితే పోలీసులు డీఎన్ఏ టెస్ట్ ఆధారంగా మృతుడు నర్సింహులపల్లి గ్రామానికి చెందిన అంకం లక్ష్మీనారాయణగా గుర్తించారు. మృతుడి కొడుకు సాయి కుమార్, కోడలు అరుణ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా నేరం ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వారికి ఎఫ్‌ఎస్‌ఎల్, హైదరాబాద్ లో పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) టెస్ట్ ద్వారా హత్య చేసింది వారేనని నిర్ధారణకు వచ్చారు. బుధవారం నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా తన తండ్రి అంకం లక్ష్మీనారాయణ రోజూ తాగి వచ్చి ఇబ్బంది పెట్టడం తోనే చంపి పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్టు చెప్పారు.