ఐదేళ్ల చిన్నారి పై కన్నేసిన కామాంధుడు.. చెట్లపొదల్లో అత్యాచారం..

by Sumithra |
ఐదేళ్ల చిన్నారి పై కన్నేసిన కామాంధుడు.. చెట్లపొదల్లో అత్యాచారం..
X

దిశ, జవహర్ నగర్ : జవహర్ నగర్ పరిధిలోని సీఆర్పీఎఫ్ అరుంధతి నగర్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని యూకేజీ చదువుతున్న ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. జవహర్ నగర్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, గోరఖ్ పూర్ ప్రాంతానికి చెందిన దంపతులు ఐదేళ్ల పాపతో ఐదేళ్ల క్రితం జవహర్ నగర్ పరిధిలోని సీఆర్పీఎఫ్ అరుంధతి నగర్ లో అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

అదే రాష్ట్రానికి చెందిన కల్లు పరమేష్ (30) వీరి ఇంటికి దగ్గరలోనే నివాసం ఉంటూ ప్రయివేట్ సంస్థలో పనికి వెళ్ళేవాడు. మద్యానికి బానిస కావడంతో గత కొంత కాలం క్రితం పనిలోంచి తీసివేశారు. ఈ నేపథ్యంలో నిందితుడు చిన్నారిని చెట్ల పొదలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దీంతో విచారణ చేపట్టి నిందితుడి పై అత్యాచారం, పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, రిమాండ్ కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story