ఆర్టీసీ బస్సు ఢీకొని ఐదుగురు దుర్మరణం

by Javid Pasha |
ఆర్టీసీ బస్సు ఢీకొని ఐదుగురు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు డీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని కాలోల్ పట్టణంలోని బస్టాప్ వద్ద కొందరు ప్రయాణికులు బస్సు కోసం వెయిటింగ్ చేస్తున్నారు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓ ప్రైవేట్ బస్సు వేగంగా వచ్చి ఢీకొన్నది. దీంతో ఆర్టీసీ బస్సు ముందుకు దూసుకురావడంతో దాని కిందపడి ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టు మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed