గండిపేట్ లో అగ్ని ప్రమాదం..

by Kalyani |
గండిపేట్ లో అగ్ని ప్రమాదం..
X

దిశ, గండిపేట్: నార్సింగి మున్సిపల్ పరిధిలోని గండిపేట్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గండిపేటలోని యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాంకు బిల్డింగ్ లోని నాల్గవ అంతస్తులో ఉన్న లాప్ టాప్ ప్యాకింగ్ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. భారీగా పొగలు చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. బిల్డింగ్ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.

అయితే మంటలు యూనియన్ బ్యాంక్ కు వ్యాపించకుండా నార్సింగి పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రమాదం జరిగిన ఆఫీసులో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కొన్ని లాప్ టాప్ లు, డెస్క్ టాప్ లు దగ్ధమైనాయి. షార్ట్ సర్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story