- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యతో గొడవపడిన భర్త.. ఇద్దరు పిల్లలతో అదృశ్యం..
దిశ, ముషీరాబాద్ : భార్యతో గొడవపడి తన ఇద్దరు పిల్లలతో కలిసి భర్త అదృశ్యమైన ఘటన దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దోమలగూడ పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి కవాడిగూడ ఎన్టీఆర్ స్టేడియం బీమా మైదానం బస్తీకి చెందిన శివకుమార్ (35)కు, విజయతో 9 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి నిఖిల్ ( 7 ), ఆరు నెలల వయస్సు ఉన్న నిత్య అనే పిల్లలు ఉన్నారు. శివ కుమార్ జిమ్ కోచ్ గా పనిచేస్తుండగా, విజయ హౌస్ గృహిణి. ఇదిలా ఉండగా భార్యాభర్తలు చిన్నచిన్న విషయాలకు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలోనే గత నెల 28వ తేదీన భర్త శివ కుమార్ ఉద్దేశ్యపూర్వకంగా భార్యతో గొడవపడి విడాకుల పత్రాలపై బలవంతంగా సంతకం చేయించి, ఆమెను, పిల్లలను ఇంటి నుండి బలవంతంగా బయటికి పంపించాడు.
దీంతో ఆమె తన పిల్లలతో కలిసి నారాయణగూడలో ఉన్న తన సోదరి సుజాత ఇంటికి వెళ్ళింది. అదే నెల 30 వ తేదీన కౌన్సెలింగ్ ఉందని, పోలీస్ స్టేషన్కు రావాలని శివ తన భార్యను కోరాడు. పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ తర్వాత, వారిద్దరూ రాజీపడి కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న తర్వాత, మళ్లీ ఆమె భర్త శివ కుమార్ మళ్ళీ గొడవ పడి ఎటువంటి సమాచారం లేకుండా ఇంటి నుండి తన పిల్లలిద్దరితో కలిసి వెళ్లిపోయాడు. అతను ఇంటికి తిరిగి వస్తాడని విజయ వేచి చూసినా లాభం లేకుండాపోయింది. ఈ మేరకు భాధితురాలు దోమలగూడ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. కాగా మిస్సింగ్ కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.