ప్రాణం తీసిన పండగ షాపింగ్

by Sumithra |
ప్రాణం తీసిన పండగ షాపింగ్
X

దిశ, తాండూర్ : మండలంలోని బోయపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతి (35) మృతి చెందినట్లు తాండూర్ ఎస్సై సమ్మయ్య తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం తిరుపతి భార్య మౌనిక, పాపతో కలిసి ఐబీ నుండి బెల్లంపల్లికి పండుగకు బట్టలు కొనుగోలు చేసేందుకు ఆటోలో వెళ్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఆటోను ఢీకొంది. తిరుపతి ఆటోలో చిక్కుకోవడంతో స్థానికులు తీవ్ర ప్రయత్నాలు చేసి బయటకు తీశారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. భార్య మౌనిక, పాపకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం మంచిర్యాల తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Next Story