- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరెంట్ షాక్‌తో రైతు మృతి.. అదికారుల నిర్లక్ష్యమే కారణమా..?
దిశ, మఠంపల్లి: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ షాక్ గురై యువ రైతు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కొత్త దోన బండ తండాలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరా ప్రకారం.. మఠంపల్లి మండలంలోని కొత్త దోన బండ తండా చెందిన బానోతు బాబు(35) తన వ్యవసాయ పొలం వద్దకు నారు మడి కి నీరు పెట్టేందుకు వెళ్ళారు. అక్కడ ఉన్న విద్యుత్ లైన్ వైరు తెగిపడంతో మెటర్‌కు విద్యుత్ సప్లై కాలేదు. దీంతో ఆ వైరును కలిపేందుకు ట్రాన్స్ పార్మర్ ఆప్ చేసి తెగిన వైరును కలుపుతుండగా.. ఆ వైర్లకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి రైతు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాన్స్ఫార్మర్‌కు అఫ్ అన్ స్విచ్ సక్రమంగా పనిచేయకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని తెలిపారు. గతంలో రైతులు పలుమార్లు సంబంధిత ఏఈకి విన్నవించినా పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. ఏఈకి ఫోన్ చేసిన ఎప్పుడు లిఫ్ట్ చేయడని ఆఫీస్‌కు వెళ్లి చెప్పిన స్పందించలేదని ఆరోపించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోరకు హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.