- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తాగుడుకు బానిసై రైతు ఆత్మహత్య..
దిశ, కౌడిపల్లి : తాగుడుకు బానిసై రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కంచనపల్లిలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కంచనపల్లి గ్రామానికి చెందిన నీల బోయిన మల్లేశం (62) గత కొన్ని మాసాలుగా తాగుడుకు బానిసై డబ్బుల కోసం భార్య జయమ్మ, కొడుకు నరేష్ ను ప్రతిరోజు వేధించేవారని తెలిపారు. ఈ క్రమంలోనే ఈనెల 26న (బుధవారం) సాయంత్రం కూడా మల్లేశం తాగి ఇంటికి వచ్చి మద్యానికి డబ్బులు ఇవ్వాలని భార్యకొడుకును వేధించాడని తెలిపారు.
తమ దగ్గర డబ్బులు లేవని వారు చెప్పడంతో నేను బ్రతికి ఉండడం దండగ అని ఇంటి నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. అరగంట తర్వాత నురగలు కక్కుతూ ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కౌడిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారన్నారు. అక్కడ వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేశారని తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో మృతి చెందాడన్నారు. మృతుని భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై విటల్ తెలిపారు.