- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నకిలీ ఇన్సూరెన్స్ ముఠా అరెస్ట్..
దిశ, మల్కాజిగిరి: నకిలీ ఇన్సూరెన్స్ పాలసీలతో అవకతవకలకు పాల్పడుతున్న ఆరుగురు ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నేరేడ్ మెట్ లోని రాచకొండ సీపీ కార్యాలయంలో కేసు వివరాలను సీపీ డీఎస్ చౌహన్ వెల్లడించారు. రాచకొండ సైబర్ క్రైమ్స్ పోలీసులు రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీల మోసాన్ని ఛేదించారు, ప్రముఖ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగి రంగ సాయి హర్ష అనే మాస్టర్ మైండ్ సహా ఆరుగురి వ్యక్తులను అరెస్ట్ చేసి రూ. 60 లక్షల క్రైమ్ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గత నెల ఏప్రిల్ లో యాప్రాల్‌లో నివసిస్తున్న ఎన్నారై నుంచి ఫిర్యాదు అందింది. ఇందులో అతను 2012, 2014లో ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో రూ. 45 లక్షల విలువైన రెండు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నట్లు పేర్కొన్నాడు.
ఇటీవల తన పాలసీల వివరాలను అప్‌డేట్ చేయడానికి బ్రాంచ్‌కి వెళ్లినప్పుడు, ఇన్సూరెన్స్ కంపెనీ ఆపరేషన్ టీమ్ అతని గురించి తెలియజేయడంతో అతను పూర్తిగా ఆశ్చర్యపోయాడు.ఒక పేరు మోసిన ఇన్సూరెన్స్ కంపెనీలో పోలీసులు తీసుకున్న పాలసీ హోల్డర్స్ యొక్క మెచ్యూరిటీ అమౌంట్ ని ఆ కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి కొంతమంది సహాయంతో ఫేక్ పత్రాల ద్వారా గత కొన్ని ఏళ్లుగా డబ్బులు కొట్టేస్తున్నాడు. ఇప్పటి వరకు వివిధ పాలసీ హోల్డర్ల యొక్క పాలసీ మొత్తాలను సుమారు నాలుగు కోట్ల రూపాయల వరకు కొట్టేశాడు.
యాప్రాల్ ప్రాంతానికి చెందిన కిషోర్ అనే ఎన్ఆర్ఐ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేయగా విషయాలన్నీ బయటపడ్డాయి. ఎ1 నిందితుడు రంగసాయి మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పాడి 19 కేసుల్లో రూ. 4 కోట్లు కాజేసినట్లు సీపీ తెలిపారు. పాలసీ దారులకు వారి ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లు ఎప్పటికప్పుడు చూసుకోవాలని , పాలసీ దారులకు చెందిన పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఈమెయిల్ ఫోన్ నెంబర్లను క్రీయేట్ చేస్తు పాలసీ డబ్బులను స్వాహా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలిందని సీపీ చౌహాన్ వెల్లడించారు.