అధికారుల అదుపులో నకిలీ వైద్యుడు

by Sridhar Babu |   ( Updated:2024-12-03 15:32:20.0  )
అధికారుల అదుపులో నకిలీ వైద్యుడు
X

దిశ,ఉప్పల్ : ఉప్పల్ మండలంలో రోజురోజుకు నకిలీ శంకర్ దాదాలు పెరిగిపోతున్నారు. చదివింది ఒకటి, వైద్యం మరొకటి చేస్తూ ప్రజల ప్రాణాలతో నకిలీ వైద్యులు చెలగాటమాడుతున్నారు. ఉప్పల్ ప్రాంతంలో బీరప్ప గడ్డ వద్ద అంజలి క్లినిక్ లో సరైన అర్హతలు లేకుండా బానోతు శ్రీను డాక్టర్ అని పేర్కొంటూ వైద్యం చేస్తున్నాడని విశ్వసనీయమైన సమాచారం మేరకు డ్రగ్ ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణ, పి.అంబేద్కర్ దాడులు నిర్వహించారు. వారు మాట్లాడుతూ మందుల ప్రిస్క్రిప్షన్ రాయడంతో పాటు క్లినిక్ లో 17 రకాల మందులను గుర్తించారు.

యాంటీ బయాటిక్స్, స్థిరాయిడ్స్, యాంటీ ఫంగల్ డ్రగ్స్ ,నొప్పి నివారణ అంపుల్స్, పిల్లలకి వాడే యాంటిబయోటిక్స్ సిరప్​, స్టీరాయిడ్ వయల్స్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా నిలువ చేసినందుకు డీసీఏ అధికారులు మందులను స్వాధీనం చేసుకున్నారు. స్థిరాయిడ్స్ వాడడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని, హార్మోన్ల అసమతుల్యత, కండరాలు, ఎముకల బలహీనత వంటి వ్యాధులు సంభవిస్తాయని అన్నారు. డ్రగ్ లైసెన్స్ లేకుండా మందులను అమ్ముతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed