ఆర్టీసీ బస్సు కిందపడి ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-13 07:06:12.0  )
ఆర్టీసీ బస్సు కిందపడి ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఆర్టీసీ బస్సు కింద పడి ఓ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన అరవింద్ (21) అనే విద్యార్థి జిల్లా కేంద్రంలో నివాసం ఉంటూ సమీపంలో ఉన్న జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్సీ బ్రాంచ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ప్రతిరోజు తన స్కూటీ‌పై కళాశాలకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో మరో మిత్రుడు సలీంతో కలిసి మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్తుండగా పాలమూరు విశ్వవిద్యాలయం వద్ద నారాయణపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు స్కూటీని వెనక నుండి బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో విద్యార్థి అక్కడికక్కడే మరణించగా మరో విద్యార్థి సలీం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ కళాశాలకు చెందిన విద్యార్థి అరవింద్ మృతి పట్ల జేపీఈఎన్ సీ కళాశాల చైర్మన్ రవి కుమార్, అధ్యాపకులు, సిబ్బంది తీవ్ర ద్రిగ్భాంతిని వ్యక్తం చేశారు.

Read More....

తిరువణ్ణామలైలో దారుణం.. కుటుంబం మొత్తాన్ని గొడ్డలితో దారుణంగా నరికి హత్య చేసిన తండ్రి

Advertisement

Next Story