- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సుఖేష్ గుప్తా వ్యవహారంపై ఈడీ అధికారిక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: ఎంబీఎస్ జ్యూవెలర్స్ ఎండీ సుఖేష్ గుప్తాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రుణాల ఎగవేత, ఫెమా నిబంధనల ఉల్లంఘనతో సహా పలు ఆరోపణలపై సుఖేష్ గుప్తాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. మొత్తం ఆరు కేసుల్లో సుఖేష్ గుప్తా మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. బంగారం వ్యాపారం చేస్తూ అక్రమాలకు పాల్పడిన అభియోగంతో రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు, సుఖేష్ గుప్తాకు చెందిన సంస్థలలో పెద్ద ఎత్తున బంగారం, బంగారు ఆభరణాలు, వజ్రాలు స్వాధీనం చేసుకుని, ఆయన్ను అరెస్ట్ చేశారు. తాజాగా.. సుఖేష్ గుప్తా వ్యవహారంపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. సుఖేష్ గుప్తాను అరెస్ట్ చేశామని ప్రకటించింది. సుఖేష్ గుప్తా షోరూముల్లో రూ.149 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 1.96 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. 2019 లో ఎంఎంటీఎస్ బంగారం కొనుగోళ్లకి సంబంధించి సోదాలు జరిపామని ఈడీ తెలిపింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరులో రెండ్రోజుల పాటు సోదాలు జరిపామని ప్రకటించారు. రూ.504 కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టారన్న ఆరోపణలపై సోదాలు జరిపినట్లు పేర్కొన్నారు. గతంలోనే వన్‌టైమ్ సెటిల్ మెంట్ ఇచ్చినా రుణం చెల్లింపులో సుఖేష్ గుప్తా విఫలం చెందారని తెలిపారు. ప్రస్తుతం సుఖేష్ గుప్తాకు చెందిన ఎంబీఎస్, మసద్దీలాల్‌లో సోదాలు పూర్తి చేశామని ప్రకటించారు. కేంద్రం ఆధీనంలో నడిచే ఎంఎంటీఎస్‌ను సుఖేష్ గుప్తా పెద్ద మొత్తంలో మోసం చేసినట్లు గుర్తించారు.