- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
East Zone DCP: బీదర్ నిందితుల కోసం సిటీ మొత్తం అలర్ట్ ప్రకటించాం

దిశ, వెబ్‌డెస్క్: బీదర్ నిందితుల కోసం సిటీ మొత్తం అలర్ట్ ప్రకటించినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి(East Zone DCP Balaswamy) స్పష్టం చేశారు. గురువారం రాత్రి ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. నిందితుల కోసం ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 4 బృందాలు ఏర్పడి గాలిస్తున్నట్లు చెప్పారు. బస్సులో ఉన్న బీదర్ పోలీసుల(Bidar Police)కు వీళ్లు నిందితులు అని తెలియదు అని అన్నారు. బీదర్ పోలీసుల స్టేట్మెంట్ రికార్డ్ చేశాం.. NBW వారెంట్‌ను ఇచ్చేందుకు రాయపూర్ వెళ్తున్నారని అన్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ అఫ్జల్‌గంజ్(Afzal Gunj firing incident)లో బీదర్ దొంగల ముఠా కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దొంగల ముఠాను పట్టుకునేందుకు బీదర్ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. అప్జల్‌గంజ్‌లో పోలీసులను చూసిన దొంగల ముఠా సభ్యులు తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. ఈస్ట్ జోన్ డీసీపీ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.