Drugs Seize: నగరంలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 53 కేజీల డ్రగ్స్ సీజ్, ముగ్గురు అరెస్ట్

by Shiva |
Drugs Seize: నగరంలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 53 కేజీల డ్రగ్స్ సీజ్, ముగ్గురు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఫ్రీ స్టేట్‌గా చేసేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖ (Police Department)కు ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఎస్‌ఓటీ (SOT), ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు (Railway Stations), ఎయిర్‌పోర్టు(Airports)లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ.. ఎక్కడికక్కడ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా, అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం మేరకు అప్రమత్తమైన పోలీసులు మీర్‌పేట్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో సుమారు 53 కేజీల డ్రగ్స్‌ను సీజ్ చేసి మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed