- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంటకు షాక్

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. మాగుంట రాఘవకు బెయిల్ ఇచ్చేందుకు న్యాస్థానం నిరాకరించింది. బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న మాగుంట రాఘవను ఈడీ అధికారులు ఫిబ్రవరి 11న అదుపులోకి తీసుకున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ ప్రధాన భూమిక పోషించిందని ఈ సౌత్ గ్రూప్‌లో మాగుంట రాఘవ కీలకంగా వ్యవహరించాడని ఈడీ నిర్ధారించింది. ప్రస్తుతం మాగుంట రాఘవ తీహార్ జైల్లో ఉన్నారు. అయితే మాగుంట బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
Next Story