ఒకేసారి ఇద్దరు ప్రియులతో కోడలు రొమాన్స్.. ఆ దృశ్యాలు చూసిన అత్త ఆగలేక..

by Hamsa |
ఒకేసారి ఇద్దరు ప్రియులతో కోడలు రొమాన్స్.. ఆ దృశ్యాలు చూసిన అత్త ఆగలేక..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సమాజంలో చాలా మంది అక్రమ సంబంధాలు పెట్టుకుని పచ్చని సంసారాలను కూల్చుకుంటున్నారు. క్షణిక సుఖం కోసం ఇతరుల ప్రాణాలు తీయడానికి వెనకాడటం లేదు. కొంత మంది జీవిత భాగస్వామి ఉండగానే ఇద్దరు ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకుని దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లోని ఓ వివాహిత ఇద్దరు ప్రియులతో రొమాన్స్ చేస్తుండగా అత్త చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో దంపతులు కుటుంబంతో కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. పెళ్లైన కొంత కాలానికి మహిళ భర్త ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాడు. దీంతో ఆ వివాహిత అత్తమామలతో కలిసి ఉంటుంది. అయితే అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో బంధువుల్లో ఇద్దరు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో వారిని ఇంటికి పిలుచుకుని ఏకాంతంగా గడిపేది. ఇటీవల వారి ఇంటికి ఇద్దరు వ్యక్తులు రావడంతో అత్తకు అనుమానం వచ్చింది. వాళ్లు ఎవరని కోడలిని అడగ్గా మా బంధువులని సమాధానమిచ్చింది. అయితే ఒకరోజు ఇంట్లో బెడ్‌రూమ్‌లో కోడలు ఆ ఇద్దరు వ్యక్తులతో రొమాన్స్ చేస్తుండగా అత్త రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుంది. వారికి తెలియకుండా గదికి తాళం వేసి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed