న్యూడ్ కాల్స్‌లో కనిపించేది నిజమైన లేడీ కాదా..? విస్తూపోయే నిజాలు చెప్పిన సైబర్ క్రైమ్ ఎక్స్‌పర్ట్ మాధవరెడ్డి

by Satheesh |   ( Updated:2023-06-06 06:30:28.0  )
న్యూడ్ కాల్స్‌లో కనిపించేది నిజమైన లేడీ కాదా..? విస్తూపోయే నిజాలు చెప్పిన సైబర్ క్రైమ్ ఎక్స్‌పర్ట్ మాధవరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోవడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా అని సైబర్ క్రైమ్ ఎక్స్‌పర్ట్ మాధవరెడ్డి తెలిపారు. ‘‘దిశ’’ టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో పలు రకాల సైబర్ మోసాల తీరుపై ఆయన వివరించారు. సైబర్ మోసాలకు గురికాకుండా ఉండాలంటే తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. ఓటీపీలు కూడా తెలియని వ్యక్తులతో షేర్ చేసుకోవద్దని తెలిపారు. లోన్స్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న న్యూడ్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందమైన యువతుల ఫొటోలతో వల వేసి ఫోన్ నెంబర్లు తీసుకుని తర్వాత బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతారని చెప్పారు. న్యూడ్ కాల్స్‌ చేసినప్పుడు మనతో నిజమైన లేడీ మాట్లాడదని.. అది పూర్తిగా రికార్డేడ్ వీడియో అని తెలిపారు. మన ఫేస్ కనిపించేలా వీడియో తీసి దానితో డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్‌కి పాల్పడుతారని చెప్పారు. అంతేకాకుండా ఆన్లైన్ గేమ్స్ అన్ని కూడా మ్యానిపులేటేడ్ అని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed