- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూల్ టాయిలెట్‌లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని.. చెత్తకుండీలో పడేసి తిరిగి క్లాస్‌కు..
దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో జరిగే కొన్ని ఘటనలు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. అలాంటి ఘటనే ఒకటి తాజాగా తమిళనాడులో చోటు చేసుకుంది. 11 తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ టాయిలెట్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం బిడ్డను టాయిలెట్‌కు దగ్గర్లోని ఓ చెత్తకుండీలో పడేసి తిరిగి క్లాస్‌కు వెళ్లిపోయింది. ఆ బిడ్డను గుర్తించిన పాఠశాల అధికారులు భువనగిరి పోలీసులకు సమాచారమిచ్చారు. స్కూల్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారి దర్యాప్తులో ఇందుకు పాల్పడిన విద్యార్థిని కనుగొన్నారు. ఆ విద్యార్థిని కూడా తానే బిడ్డకు తల్లినని ఒప్పుకుంది. అయితే తనకు కడుపు నెప్పిగా ఉందని టాయిలెట్‌కు వెళ్లానని, అక్కడే బిడ్డకు జన్మనిచ్చానని తెలిపిందని పోలీసులు వెల్లడించారు.
అంతేకుండా బిడ్డ చనిపోయిందని ఆ విద్యార్థిని చెప్పగా, తాను ఎవరి సహాయం లేకుండా జన్మనిచ్చిన కారణంగా బిడ్డ మరణించి ఉంటుందని పోలీసుల తెలిపారు. దాంతో పాటుగా విద్యార్థిని బిడ్డకు ఉండే బొడ్డు తాడును ఓ పెన్నుతో కత్తిరించిందని, ఆ తర్వాత తిరిగి క్లాస్‌కు వచ్చేసిందని చెప్పుకొచ్చారు. అయితే తాను గర్బవతినని బంధువులకు, కుటుంబీకులకు ఎవరికీ చెప్పలేదని విద్యార్థిని చెప్పుకొచ్చింది. దీంతో విద్యార్థినిని గర్భవతిని చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ఆమె బంధులు, స్థానికులను విచారిస్తున్నారు.