పశువుల దొంగలు అరెస్ట్​

by Sridhar Babu |
పశువుల దొంగలు అరెస్ట్​
X

దిశ, మధిర : పశువుల దొంగలను పోలీసులు అరెస్ట్​ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఆత్కూరు గ్రామానికి చెందిన మళ్ల భాగ్యమ్మ తమ పశువులను కొట్టంలో కట్టేసి ఉంచగా బుధవారం దొంగలు జత ఆవులను అపహరించారు. మరల లేక దూడను తోడుకొని వెళ్లేందుకు వచ్చారు. అయితే పశువుల కొట్టం వద్ద సీసీ కెమెరా ఉండడంతో ఈ తతంగాన్ని అంతా గమనిస్తూ భాగ్యమ్మ కుమారులు పొలం నుండి ఇంటికి చేరుకొని దొంగలను బంధించి పట్టణ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. సమాచారం మేరకు పట్టణ ఎస్సై ఎన్.సంధ్య హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పశువులను అపహరిస్తున్న దొంగలను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement

Next Story