తెలంగాణ పోలీసుల దూకుడు.. 11 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-17 13:29:32.0  )
తెలంగాణ పోలీసుల దూకుడు..  11 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్ యాప్స్(Betting Apps) ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై తెలంగాణ పోలీసులు ఫోకస్ చేశారు. ప్రధానంగా యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు(Social media influencers) ఐపీఎస్ అధికారి, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar) హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా పదకొండు మంది సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో విష్ణుప్రియ, సుప్రిత, రీతుచౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, అజయ్, కిరణ్ గౌడ్, భయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజు సహా పలువురు ఉన్నట్లు సమాచారం. వీరంతా పదే పదే బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారని పోలీసులు మండిపడుతున్నారు. దీంతో యువత చెడు దారిన పోయే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అలాంటి వారందరి జాబితాను సిద్ధం చేసి కేసులు నమోదు చేస్తున్నారు.

కాగా, ఇటీవలే సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్‌పై సజ్జనార్ ఉద్యమం ప్రారంభించారు. ఇందులో చాలా మంది సెలబ్రిటీలు భాగస్వాములపై యువత చెడు దారిపట్టకుండా మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాను ఎవరిపైనా వ్యక్తిగతంగా పోరాటం చేయడం లేదు.. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించి పబ్బం గడుపుకొంటోన్న సోషల్ మీడియా ఇన్‌ ఫ్లూయెన్సర్లతో మాత్రమే పోరాడుతున్నాను. వారు లక్షలాది మందిని తప్పుదారి పట్టిస్తున్నారు. జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. ఆలస్యం కాకముందే మేల్కొండి. బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా నాతో కలిసి పోరాడండి అని సజ్జనార్ పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed