Car wreck : జగిత్యాలలో కారు బీభత్సం

by Sridhar Babu |
Car wreck : జగిత్యాలలో కారు బీభత్సం
X

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల పట్టణంలో ఆదివారం సాయంత్రం బీట్ బజార్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద కారు బీభత్సం (Car wreck)సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా నడపడంతో మైనర్ బాలుడు ప్రమాదానికి గురయ్యాడు. ఈ యాక్సిడెంట్ (Accident)లో తీవ్రంగా గాయపడిన ఆరు సంవత్సరాల బాలుడిని మొదట జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలించారు. ఈ ప్రమాదానికి బారి అనే వ్యక్తి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా బారీ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed