- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Road Accident:పొట్టకూటి కోసం వచ్చి మృత్యు ఒడిలోకి
దిశ,నందికొట్కూరు: పొట్టకూటి కోసం ఉన్న ఊరును వదిలి పరాయి రాష్ట్రానికి వలస వచ్చిన కార్మికుడిని మృత్యువు కబళించింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వివరాల్లోకి వెళితే.. నందికొట్కూరు పట్టణంలోని కేంద్ర ప్రభుత్వ గిడ్డంగుల సమీపంలో కేజీ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందారు. శరీర భాగాలు నుజ్జు నుజ్జుగా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఉదయం కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన సంజిత్ తీర్కీ(30) గా గుర్తించారు. 340సి రహదారి పనుల కోసం శుక్రవారం రాత్రి వలస వచ్చినట్లు తోటి కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. టీ తాగేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం మున్సిపల్ కార్మికుల సహాయం తో ట్రాక్టర్‌లో ప్రభుత్వ వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని సొంత రాష్ట్రానికి తరలించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని తోటి కార్మికులు తెలిపారు.